
మూడేళ్లుగా ప్రాక్టీస్ లేకుండానే...
కాస్త ఆశ్చర్యంగా అనిపించినా... భారత కెప్టెన్ ధోని నెట్స్‌లో కీపింగ్ ప్రాక్టీస్ చేయక మూడేళ్లు దాటిపోయింది.
మెల్‌బోర్న్: కాస్త ఆశ్చర్యంగా అనిపించినా... భారత కెప్టెన్ ధోని నెట్స్‌లో కీపింగ్ ప్రాక్టీస్ చేయక మూడేళ్లు దాటిపోయింది. సాధారణంగా అన్ని జట్ల వికెట్ కీపర్లు మ్యాచ్‌కు ముందు రోజైనా నెట్స్‌లో కొద్దిసేపైనా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ధోని మాత్రం వీళ్లందరికంటే భిన్నం. జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్ తరహాలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. అంతేకానీ ఎప్పుడూ గ్లౌవ్స్‌తో కీపింగ్‌కు రాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు చేసే ప్రాక్టీస్‌లో మాత్రం కేవలం ఓ పది బంతులు గ్లౌవ్స్‌తో పట్టుకుంటాడు.
అధిక ఒత్తిడి ఉండకూడదనే...
టెస్టుల్లో రోజుకు 90 ఓవర్లు... వన్డేలో 50 ఓవర్లు కీపింగ్ చేయడం కష్టమే. అలాగే భారత జట్టుకు ఉం డే షెడ్యూల్ కూడా మిగిలిన వాళ్లతో పోలిస్తే బాగా బిజీ. కాబట్టి ప్రాక్టీస్ సెషన్లను తెలివిగా వాడుకోవాలనేది ధోని భావన. శరీరాన్ని మరింత ఎక్కువగా కష్టపెట్టడం ద్వారా గాయాల బారిన పడతామని కెప్టెన్ అభిప్రాయం. ఏమైనా ధోని రూటే సెపరేటు.