లండన్: టీమిండియా సారథి విరాట్ కోహ్లిని ఓ సుల్తాన్‌లా చూపిస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఐసీసీ తీరును తప్పుబడుతూ ఇప్పటికే మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ.. మరో బీసీసీఐలా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ స్పందించాడు. ఐసీసీ చేసిన ట్వీట్ నిష్పక్షపాతంగా లేదంటూ ట్వీట్ చేశాడు. అయితే వాన్ ట్వీట్‌కు ఐసీసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కింగ్ కోహ్లి ఫోటోను సమర్థించుకుంది. వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్ వన్ అంటూ కామెంట్ చేస్తూ, పలు స్క్రీన్ షాట్‌లను జత చేసి పోస్ట్ చేసింది.
అసలేం జరిగిందంటే..
ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా మ్యాచ్‌కు ముందు ఐసీసీ కోహ్లి ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో కోహ్లి ఓ చేతిలో బ్యాట్, మరో చేతిలో బాల్, కిరీటం ధరించి, రాజును పోలిన డ్రెస్‌లో దర్శనమిచ్చాడు. అంతేకాదు టీమిండియా గెలిచిన ప్రపంచకప్ సంవత్సరాలతో పాటు కోహ్లిని పొగుడుతూ కొన్ని కొటేషన్స్‌లు అందులో ఉన్నాయి. అయితే దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఐసీసీ, బీసీసీఐ ఒక్కటయ్యాయి’,‘బీసీసీఐ.. ఐసీసీని సొంతం చేసుకుంది’,‘టీమ్‌ఇండియా అభిమాని లాగా ఐసీసీ ప్రవర్తిస్తోంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment