ఆదివారం న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీంలో క్రికెటర్ ఇలియట్ సెంచరీ చేస్తాడని క్రికెట్ అభిమానులు చెప్పారు. ఇలియట్ 67 పరుగులతో క్రీజులో ఉండగా ఇలియట్ సెంచరీ చేస్తాడా అంటూ సాక్షి క్రికెట్ అభిమానులను ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. మరికొందరు మాత్రం 100కు పైగా పరుగులే చేస్తాడని అన్నారు. ఇంకొందరు అన్ని పరుగులు చేయలేకపోవచ్చని తెలిపారు. కొందరు క్రికెట్ అభిమానులైతే చేయొచ్చు చేయలేకపోవచ్చు.. కొట్టే వరకు చెప్పలేం అని మిశ్రమ స్పందన తెలియజేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఇలియట్ 73 పరుగులతో క్రీజులో ఉన్నాడు.