‘ఈ విజయం.. అద్భుతం’ | Imran Khan Congratulates Pakistan For Great Comeback In World Cup | Sakshi
Sakshi News home page

‘ఈ విజయం.. అద్భుతం’

Published Thu, Jun 27 2019 3:33 PM | Last Updated on Thu, Jun 27 2019 3:35 PM

Imran Khan Congratulates Pakistan For Great Comeback In World Cup - Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. భారత్‌పై ఘోర ఓటమి అనంతరం వరుసగా రెండు విజయాలు సాధించి రేసులోకి వచ్చింది పాకిస్తాన్‌. దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్‌ గ్యాంగ్‌కు అభినందనలు తెలిపారు. ‘ఈ విజ‌యం నన్ను అబ్బుర‌ప‌రిచింది. ఆనందంలో నింపేసింది. పాక్‌ జట్టుకు అభినందనలు. ఇదొక గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌. ప్రధానంగా సెంచరీతో మెరిసిన బాబర్‌ అజామ్‌తో పాటు కీలక సమయంలో ఆకట్టుకున్న హరీస్‌ సొహైల్‌కు కంగ్రాట్స్‌. బౌలింగ్‌లో మెరిసి కివీస్‌ను కట్టడి చేసిన షాహీన్‌ అఫ్రిది ప్రదర్శన అద్భుతం’ అంటూ ఇమ్రాన్‌ కొనియాడారు. (ఇక్కడ చదవండి: పాక్‌ రేసులోకొచ్చింది)

ఇక ఆ దేశ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కూడా పాక్‌ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. బాబర్‌ అజామ్‌, హరీస్‌ సొహైల్‌లు అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టకున్నారు. ఈ విజయం పాక్‌కు చాలా ప్రత్యేకం. బాబర్‌ ఇన్నింగ్స్‌ అసాధారణ రీతిలో సాగింది. అతనికి సొహైల్‌ నుంచి మంచి సహకారం లభించింది’ అని అఫ్రిది పేర్కొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement