సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో టాప్‌సీడ్ స్నేహదేవి రెడ్డి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం ఎల్బీస్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన బాలికల అండర్-18 సింగిల్స్ తొలి రౌండ్‌లో స్నేహదేవి 6-0, 6-0తో వాట్స్‌కోల్ సవసదీ (థాయ్‌లాండ్)పై గెలిచింది.
ఇతర మ్యాచ్‌ల్లో నయనికా రెడ్డి 1-6, 7-5, 6-1తో వాన్షికా సహానీపై; స్నేహల్ మానే 6-3, 6-3తో రోమా చంద్రియాన్‌పై; ప్రియాంకా సుధీర్ 6-2, 6-0తో అభినికా రంగనాథ్‌పై; నందిని దాస్ 6-4, 6-1తో నిదా షాహిద్ కమల్‌పై; మియో కొబయోషి (జపాన్) 1-6, 6-1, 6-3తో రష్మీతారెడ్డిపై; వాసంతి షిండే 2-6, 7-6 (4), 6-3తో అక్షర ఇస్కాపై గెలిచారు. బాలుర విభాగంలో మోహిత్ జైన్ 6-1, 6-3తో చెంచన్ దీపల్‌పై; రవి కుమార్ 6-1, 6-1తో సనీల్ జగ్తానిపై; ప్రజ్వల్ 6-2, 6-2తో తాహా కపాడియాపై; బాలాజీ లక్ష్మణ్ 7-6 (3), 6-3తో కుషాన్‌నాథ్‌పై; దీపక్ కరమ్ 6-1, 6-3తో అభిషేక్ గౌర్‌పై, వశిష్ట్ 6-4, 6-0తో విజయ్ రామన్‌పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
రెండోరౌండ్‌లో స్నేహదేవి
Published Wed, Sep 4 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement