ITF junnior tournment
-
ఐటీఎఫ్ సింగిల్స్ లోనూ మెరిసిన సాకేత్
భీమవరం: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని సింగిల్స్‌లోనూ మెరిశాడు. శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఈ వైజాగ్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. డబుల్స్‌లో టైటిల్ నెగ్గిన ఉత్సాహంతో ఉన్న సాకేత్.. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-3, 6-1తో రెండో సీడ్ సనమ్ సింగ్ (భారత్)ను ఓడించాడు. 10 ఏస్‌లతో అదరగొట్టిన సాకేత్ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. డబుల్స్‌లో తన భాగస్వామిగా ఉన్న సనమ్ సింగ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు సనమ్ సింగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 2012లో ఇదే టోర్నీ ఫైనల్లో సనమ్ సింగ్ చేతిలో మూడు సెట్ల పోరాటంలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న సాకేత్ ఈ ఏడాది మాత్రం అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఓడించి బదులు తీర్చుకోవడం విశేషం. భారత డేవిస్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న సాకేత్ కెరీర్లో ఇది 9వ ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్. -
ఐటీఎఫ్ టోర్నీ రన్నరప్ విష్ణు
చండీగఢ్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలవాలన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ ఆశలు నెరవేరలేదు. శనివారం ఇక్కడ జరిగిన సింగిల్స్ ఫైనల్లో విష్ణు 5-7, 3-6తో ఆంటల్ వాండర్ డ్యుమ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జీవన్, మూడో సీడ్ శ్రీరామ్ బాలాజీలను చిత్తు చేసి జోరుమీదున్నట్లు కనిపించిన విష్ణు ఫైనల్లో మాత్రం అదే ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. విష్ణు చివరిసారిగా 2012 జూన్‌లో ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత అతడు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఇక ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన విష్ణుకు 10 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
రెండోరౌండ్లో స్నేహదేవి
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో టాప్‌సీడ్ స్నేహదేవి రెడ్డి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం ఎల్బీస్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన బాలికల అండర్-18 సింగిల్స్ తొలి రౌండ్లో స్నేహదేవి 6-0, 6-0తో వాట్స్కోల్ సవసదీ (థాయ్‌లాండ్)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో నయనికా రెడ్డి 1-6, 7-5, 6-1తో వాన్షికా సహానీపై; స్నేహల్ మానే 6-3, 6-3తో రోమా చంద్రియాన్పై; ప్రియాంకా సుధీర్ 6-2, 6-0తో అభినికా రంగనాథ్‌పై; నందిని దాస్ 6-4, 6-1తో నిదా షాహిద్ కమల్‌పై; మియో కొబయోషి (జపాన్) 1-6, 6-1, 6-3తో రష్మీతారెడ్డిపై; వాసంతి షిండే 2-6, 7-6 (4), 6-3తో అక్షర ఇస్కాపై గెలిచారు. బాలుర విభాగంలో మోహిత్ జైన్ 6-1, 6-3తో చెంచన్ దీపల్పై; రవి కుమార్ 6-1, 6-1తో సనీల్ జగ్తానిపై; ప్రజ్వల్ 6-2, 6-2తో తాహా కపాడియాపై; బాలాజీ లక్ష్మణ్ 7-6 (3), 6-3తో కుషాన్నాథ్పై; దీపక్ కరమ్ 6-1, 6-3తో అభిషేక్ గౌర్‌పై, వశిష్ట్ 6-4, 6-0తో విజయ్ రామన్‌పై గెలిచి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు.