ఐటీఎఫ్ టోర్నీ రన్నరప్ విష్ణు | itf tournament runnerup vishnu | Sakshi
Sakshi News home page

ఐటీఎఫ్ టోర్నీ రన్నరప్ విష్ణు

Published Sun, Mar 2 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

ఐటీఎఫ్ టోర్నీ రన్నరప్ విష్ణు

ఐటీఎఫ్ టోర్నీ రన్నరప్ విష్ణు

 చండీగఢ్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలవాలన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ ఆశలు నెరవేరలేదు.

 

శనివారం ఇక్కడ జరిగిన సింగిల్స్ ఫైనల్లో విష్ణు 5-7, 3-6తో ఆంటల్ వాండర్ డ్యుమ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.

 

ఈ టోర్నీలో టాప్ సీడ్ జీవన్, మూడో సీడ్ శ్రీరామ్ బాలాజీలను చిత్తు చేసి జోరుమీదున్నట్లు కనిపించిన విష్ణు ఫైనల్లో మాత్రం అదే ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. విష్ణు చివరిసారిగా 2012 జూన్‌లో ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత అతడు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఇక ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన విష్ణుకు 10 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement