ఇండోర్: టీమిండియా యంగ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి ప్రధాన వార్తల్లోకెక్కాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఇండోర్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మయాంక్(243; 330 బంతుల్లో 28 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ ద్విశతకం సాధించడంతో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు స్కోర్ కంటే మయాంక్ సాధించిన పరుగులే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక గత నాలుగు టెస్టుల వ్యవధిలో రెండు ద్విశతకాలు సాధించడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌లో అతడు కొట్టిన సిక్సర్ కొట్టిన ప్రతీసారి బంతి స్టేడియం బయట పడటం మరో విశేషం.
ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ సరసన చేరాడు. 1994లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిద్దూ ఎనిమిది సార్లు బంతిని స్టేడియం దాటించాడు. ఇక ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడాడు.
‘ఇదే ఉత్సాహాన్ని, సంతోషాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని కోరుకుంటున్నాను. తొలుత భారీ సిక్సర్ల విషయానికి వస్తే.. ప్రాక్టీస్ చేసిన మాట వాస్తవమే.. కానీ టెస్టుల కోసం కాదు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఇలా భారీ సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నించా. ఇక టీమిండియాకు ఆడాలనేది నా కల.. అది నిజమైంది. సుదీర్ఘ కాలం టీమిండియా జెర్సీ వేసుకుంటూ.. దేశానికి విజయాలను అందిస్తూ.. అభిమానులను అలరించాలని అనుకుంటున్నాను. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. నేను 150 పరుగుల వద్ద ఉన్న సమయంలో ద్విశతకాన్ని ఎంతో దూరంలో లేవు.. డూ ఇట్ అని డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోహ్లి ప్రోత్సహించాడు. ఇక డబుల్ సెంచరీ అనంతరం త్రి శతకం సాధించు అని మరో సిగ్నల్ ఇచ్చాడు. కానీ నా పోరాటం 243 వద్దే ఆగిపోయింది.
ఇక కీలక సమయంలో నా బ్యాటింగ్ తీరుపట్ల సంతోషంగా ఉన్నాను. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టు 20 వికెట్లు పడగొట్టడంతో సులువుగా విజయం సాధించాం. వరుసగా భారీ విజయాలు సాధించడం పట్ల సంతోషంగా ఉంది. సమిష్టి కృషితో విజయాలను ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నాం. ఇక తర్వాత జరగబోయే డై నైట్ టెస్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. దీనిలో భాగంగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్స్‌తో సాధన చేయనున్నాం. దీనికోసం బెంగళూరులో దిగ్గ జ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ సమక్షంలో మూడు ప్రాక్టీస్ సెషన్‌లను బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది’అని మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment