న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ విధ్వంసకర ఆటగాడు ఏమీ కాదంటూనే అతనిపై ప్రశంసలు కురిపించాడు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. అతనొక వ్యవస్థీకృత బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. తనకు అగర్వాల్ బ్యాటింగ్‌పై పూర్తి విశ్వాసం ఉందని గంభీర్ చెప్పుకొచ్చాడు. ‘ టీమిండియా క్రికెట్ జట్టులో అతను విధ్వంసకర ఆటగాడు కాకపోవచ్చు. ఇక్కడ వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ వార్నర్‌ల తరహాలో అతని బ్యాటింగ్ ఉండకపోవచ్చు. కానీ అతని బ్యాటింగ్‌లో ఒక పద్ధతి ఉంది. అతని మైండ్‌లో ఏమి చేస్తున్నామనే క్లారిటీ ఉంది. అదే అతని బలం. ఓపెనర్‌గా ఒక క్లియర్ మైండ్ సెట్‌తో ఉన్నాడు మయాంక్’ అని గంభీర్ తెలిపాడు. (ఇక్కడ చదవండి: ‘వైట్ వాష్’ చేయాల్సిందే..)
ఇక న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా మయాంక్‌తో కలిసి పృథ్వీ షా-శుబ్‌మన్ గిల్‌ల్లో ఎవరు ఓపెనింగ్ చేస్తారో చూడాలని ఉందన్నాడు. గిల్-షాలలో మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే వారు తప్పకుండా టీమిండియా కొత్త ఓపెనింగ్ జంట కానుందన్నాడు. ఇక్కడ షా సహజసిద్ధమైన ఓపెనర్ అయితే, ఈ స్థానంలో గిల్ ఫిట్ కావడం కోసం యత్నిస్తున్నాడని గంభీర్ తెలిపాడు. తనను అడిగితే ఇన్నింగ్స్‌ను ఆరంభించడం ఏమీ కొత్తగా ఉండదన్నాడు. కాకపోతే ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి నాల్గో నంబర్‌లో బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది చాలెంజింగ్ ఉంటుందన్నాడు. అప్పుడే అసలు సిసలైన ఒత్తిడి ఉంటుందన్నాడు. ఓపెనర్‌గా వెళితే ఒత్తిడి ఉంటుందనేది వాస్తవం కాదన్నాడు. (ఇక్కడ చదవండి: ఇది తగదు.. మార్చాల్సిందే: విలియమ్సన్)
Comments
Please login to add a commentAdd a comment