స్వతంత్ర కంపెనీగా ‘సూపర్ కింగ్స్’
చెన్నై: ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమ మాతృసంస్థ ఇండియా సిమెంట్స్‌నుంచి వేరు కానుంది. ఈ ఐపీఎల్ జట్టును విడిగా నమోదు చేయాలని ఇండియా సిమెంట్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇండియా సిమెంట్స్‌కు అనుబంధ సంస్థే అయినా ఇకపై సూపర్ కింగ్స్ స్వతంత్ర కంపెనీగా వ్యవహరిస్తుంది. అయితే యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఎన్. శ్రీనివాసనే దీనికి కూడా వైస్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తారు. ఈ నెల 26న జరిగే సంస్థ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో దీనిని ప్రతిపాదించనున్నారు. ఇతర ఐపీఎల్ జట్లు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇదే విధంగా రిలయన్స్, యూబీ గ్రూప్ అనుబంధ సంస్థలుగా ఇప్పటికే కొనసాగుతున్నాయి.