
మహిళల హాకీలో భారత్ రెండో విజయం నమోదు చేసింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1తో సంచలన విజయం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (42వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (48వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్‌కు తొలి నిమిషంలోనే కెప్టెన్ అలెగ్జాండ్రా డాన్సన్ ఏకైక గోల్‌ను అందించింది. ఇంగ్లండ్ మహిళల జట్టుపై భారత్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు 4–3తో వేల్స్‌పై గెలిచింది.
► అథ్లెటిక్స్‌లో తేజిందర్ సింగ్ షాట్‌పుట్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్‌లో అతను ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల 20 కిలోమీటర్ల నడకలో ఖుష్‌బీర్ కౌర్ నాలుగో స్థానంలో, పురుషుల 20 కిలోమీటర్ల నడకలో మనీశ్ సింగ్ ఆరో స్థానంలో, ఇర్ఫాన్ 13వ స్థానంలో నిలిచారు.
► ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రణతి నాయక్... పురుషుల రింగ్స్ ఫైనల్లో రాకేశ్ పాత్రా చివరిదైన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment