దుబాయ్: భారత్‌లో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఓ మెలిక పెట్టింది. 2021లో చాంపియన్స్ ట్రోఫిని భారత్‌లో నిర్వహించాలంటే పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది.
2016లో టీ20 ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వలేదని, దీంతో టోర్నీ ఖర్చు ఎక్కువైందని ఐసీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు కావాలని బీసీసీఐకి సూచించినట్ల సమాచారం. ఎందుకంటే టోర్నీ నిర్వహించడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని, ఇలాంటి సమయంలో పన్ను మినహాయింపే కాస్త ఊరట ఇచ్చే అంశమని బీసీసీఐకి వివరించినట్లు తెలుస్తోంది.
ఒక వేళ పన్ను మినహాయింపు లభించకపోతే ప్రత్యామ్నాయ వేదికల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్ల తెలుస్తోంది. మరో పక్కా బీసీసీఐ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టోర్నీ విషయంలో ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment