
మూడో టెస్టు:ఎదురీదుతున్న భారత్
సౌతాంప్టన్:ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. 25/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కులు చూపించారు. వరుస వికెట్లు తీసి భారత టాప్ ఆర్డర్ ను దెబ్బతీశారు. భారత్ ఆటగాళ్లలో మురళీ విజయ్(35), పూజారా(24),విరాట్ కోహ్లి(39),రోహిత్ శర్మ(28) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అయితే రహానే మాత్రం బాధ్యతాయుతంగా ఆడి కాస్తలో కాస్త ఫర్వాలేదనిపించాడు. రహానే(54) పరుగుల వద్ద అలీ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో భారత్ భారం ధోనీ, జడేజాలపై పడింది. ప్రస్తుతం క్రీజ్ లో ధోని(20), జడేజా(14) పరుగులతో ఆడుతున్నారు. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ 253 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
భారత్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 316 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ పైచేయి సాధించిన ఈ మ్యాచ్లో భారత్కు డ్రా చేసుకోవడం మినహా విజయావకాశాలు దాదాపుగా లేనట్లే కనబడుతోంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్, బ్రాడ్, అలీలకు తలో రెండు వికెట్లు లభించాయి.