
ఆక్లాండ్: టీమిండియాతో జరిగిన తొలి టీ20లో తాము గెలవడానికి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవడంలో విఫల కావడంతో పరాజయం చెందినట్లు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమన్స్ పేర్కొన్నాడు. తాము నిర్దేశించిన స్కోరు తక్కువేమీ కాదని, కానీ దానిని కాపాడుకోవడం సాధ్యం కాలేదన్నాడు. తమ పేస్ బౌలింగ్ విభాగం బాగానే ఉన్నప్పటికీ ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విఫలం చెందారన్నాడు. ఈ పిచ్‌పై రెండొందలు మంచి స్కోరేనని, అసలు తమకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన భారత్‌కే మొత్తం క్రెడిట్ చెందుతుందన్నాడు. (ఇక్కడ చదవండి: టీ20 చరిత్రలో ఇదే తొలిసారి..!)
భారత్ ఆటగాళ్లు తమకు ఏ సమయంలోనూ అవకాశం ఇవ్వలేదని, ఎదురుదాడికి దిగి తమను ఒత్తిడిలోకి నెట్టారన్నాడు. దాంతోనే పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నాడు. వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లో నెడదామంటే అది సాధ్యపడలేదన్నాడు. భారత జట్టులో ప్రతీ బ్యాట్స్‌మన్ భాగస్వామ్యాలు నమోదు చేస్తూ ఎక్కడా రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారన్నాడు. భారత ఆటగాళ్లలో ప్రతీ ఒక్కరూ తమ రోల్‌ను సమర్ధవంతంగా నిర్వర్తించారని విలియమ్సన్ కొనియాడాడు. వచ్చే గేమ్ నాటికి గాడిలో పడటం తమకు ఎంతో ముఖ్యమన్నాడు. (ఇక్కడ చదవండి: అయ్యర్ అదరహో.. )