దక్షిణాఫ్రికా లక్ష్యం 173 | India Sets 173 Target For South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా లక్ష్యం 173

Published Sat, Feb 24 2018 11:24 PM | Last Updated on Sat, Feb 24 2018 11:24 PM

India Sets 173 Target For South Africa - Sakshi

కేప్‌ టౌన్, దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ-20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు ప్రోటీస్‌ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

పర్యటనలో విఫలం చెందిన రోహిత్‌ మరోమారు నిరాశపర్చాడు. 11 పరుగులు మాత్రమే చేసి డాలా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత సురేష్ రైనా, ధావన్‌లు సఫారీలపై విరుచుకుపడ్డారు. రైనా 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 43 పరుగులు చేసి షంషీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం మంచి ఫాంలో ఉన్న ధావన్(46) రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డాలా 3, మోరిస్ 2, షంషీ 1 వికెట్ తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement