భారత్‌-కివీస్‌ మ్యాచ్‌లో కలకలం | India vs New Zealand: Intruders Storm onto Ground in Wellington | Sakshi
Sakshi News home page

భారత్‌-కివీస్‌ మ్యాచ్‌లో కలకలం

Published Fri, Jan 31 2020 5:55 PM | Last Updated on Fri, Jan 31 2020 5:56 PM

India vs New Zealand: Intruders Storm onto Ground in Wellington - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌ సందర్భంగా ఇద్దరు ప్రేక్షకులు మైదానంలోకి దూసుకురావడంతో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి వారిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. 166 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నవదీప్‌ సైనీ బౌలింగ్‌ చేస్తుండగా ప్రేక్షకుడు ఒకరు భద్రతను ఉల్లఘించి మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. అతడిని పట్టుకుని భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. తర్వాత మరో అభిమాని ఆటగాళ్ల మధ్యకు దూసుకొచ్చాడు. వెంటనే తేరుకున్న భద్రతాధికారులు అతడిని కూడా బయటకు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. (చదవండి: శాంసన్‌ ఏందిది..?)

న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లోకి ప్రేక్షకులు చొచ్చకురావడం ఇదే మొదటిసారి కాదు. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన మూడో, చివరి టి20 మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని అభిమాని ఒకరు మైదానంలోకి చొచ్చుకొచ్చి అతడికి పాదాభివందనం చేసి కలకలం రేపాడు. అభిమానిని సహృదయంతో స్వీకరించిన ధోని అతడు కప్పుకుని వచ్చిన భారత జాతీయ పతాకాన్ని కింద పడకుండా పట్టుకుని అందరి మనసులను గెలుచుకున్నాడు. కాగా, ‘వియ్‌ మిస్‌ యూ ధోని’ అంటూ అతడి అభిమానులు ఈరోజు మ్యాచ్‌లో ప్లకార్డులు ప్రదర్శించారు. (చదవండి: టీమిండియా ‘డబుల్‌ సూపర్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement