భారత్, వెస్టిండీస్ టెస్టు నాలుగో రోజూ వర్షార్పణం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ నాలుగోరోజు కూడా వర్షార్పణం కావటంతో.. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు భారత్ చేజారనుంది. గతవారం శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 0-3తో ఓడిపోవటంతో భారత్ మొదటి స్థానానికి ఎగబాకింది. దీనిని కాపాడుకోవడానికి భారత్ ఈ టెస్టు గెలవాల్సి ఉంది. కానీ అనూహ్యంగా మూడున్నర రోజులపాటు వర్షం కారణంగా ఆట సాగలేదు.
తొలివన్డేలో ఆస్ట్రేలియా విజయం: శ్రీలంకతో కొలంబోలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్లతో గెలిచింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 228 పరుగులు చేసి నెగ్గింది.
నంబర్‌వన్ చేజారినట్లే
Published Mon, Aug 22 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
Advertisement
Advertisement