port of spain
-
WI VS IND 2nd Test: సచిన్.. కోహ్లి.. ఇద్దరూ ఒకేలా..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇద్దరూ క్రికెట్‌కు సంబంధించి చాలా విషయాల్లో ఒకేలా ఉంటారు. ఆట పట్ల అంకితభావం, జట్టును గెలిపించాలన్న కసి.. ఇలా చాలా విషయాల్లో ఇద్దరు దిగ్గజాల మధ్య దగ్గరి పోలికలు ఉంటాయి. ఇక పరుగులు సాధించడం, రికార్డులు కొల్లగొట్టడం విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో ప్లాన్డ్గా జరుగుతున్నట్లు సచిన్‌లా కోహ్లి జర్నీ కొనసాగుతుంది. విండీస్‌తో రెండో టెస్ట్‌కు ముందు కోహ్లి 499 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 75 శతకాలు చేసి ఉంటే, సచిన్ కూడా 499 మ్యాచ్‌ల తర్వాత అన్నే శతకాలు సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కోహ్లికి సంబంధించి చాలా మైల్‌స్టోన్స్‌లో సచిన్‌తో సరిసమానంగా నిలిచాడు. Sachin Tendulkar scored his 29th Test hundred in Port of Spain in 2002. Virat Kohli scored his 29th Test hundred in Port of Spain in 2023. Two GOAT's 💯pic.twitter.com/mLBRllLC6Y — Johns. (@CricCrazyJohns) July 21, 2023 ఇలాంటిదే మరొకటి కోహ్లి 500వ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. 2002లో ప్రస్తుతం భారత్.. విండీస్‌ను ఢీకొంటున్న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా సచిన్ తన 29వ టెస్ట్ సెంచరీని నమోదు చేయగా.. యాదృచ్చికంగా కోహ్లి కూడా ఇదే మైదానంలో తన 29వ టెస్ట్ సెంచరీ చేశాడు. గణంకాల విషయంలో ఇలాంటి ఎన్నో ఘటనలు సచిన్, కోహ్లిల మధ్య జరిగాయి. ఇదిలా ఉంటే, కోహ్లి తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 500వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా, దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ (29) రికార్డు సమం చేయటం.. ఇలా, కోహ్లి తన 29వ టెస్ట్ శతకంతో పలు రికార్డులు నమోదు చేశాడు. రెండో రోజు ఆటలో కోహ్లి (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) శతకానికి తోడు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. తేజ్‌నరైన్ చంద్రపాల్ (33) ఔట్ కాగా.. బ్రాత్‌వైట్ (37), మెక్కెంజీ (14) క్రీజ్‌లో ఉన్నారు. -
సూపర్ సిరాజ్.. మూడు బంతుల్లో రెండు వికెట్లు.. వీడియో వైరల్!
పోర్ట్ ఆఫ్‌స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 117 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక పలుమార్లు వర్షం అంతరాయం కలిగించచిన ఈ మ్యాచ్ ను 36 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుుల చేసింది. భారత బ్యాటర్లలో శుభమాన్ గిల్(96), శిఖర్ ధావన్(58) పరుగులతో రాణించారు. అనంతరం డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో విండీస్ టార్గెట్‌ను 257 పరుగులగా నిర్దేశించారు. ఇక 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను ఆదిలోనే భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతికే కైల్ మైర్స్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. మూడో బంతికే బ్రూక్స్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఒక్క పరుగుకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం ఏ దశలోనే విండీస్ కోలుకోలేక పోయింది. ఈ క్రమంలో విండీస్ 26 ఓవవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో చహల్ 4, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక సిరాజ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మూడో వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ ►టాస్: ఇండియా- బ్యాటింగ్ ►మ్యాచ్‌కు వర్షం ఆటంకి ►ఇండియా స్కోరు: 225-3 (36 ఓవర్లు) ►డక్‌వర్త్ లూయీస్ పద్ధతి(డీఎల్ఎస్)లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం 257 పరుగులు ►వెస్టిండీస్ స్కోరు: 137-10 (26 ఓవర్లు) ►విజేత: ఇండియా- డీఎల్ఎస్ పద్ధతిలో 119 పరుగుల తేడాతో గెలుపు ►మూడు మ్యాచ్‌ల సిరీస్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు- నాటౌట్) ►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: శుబ్‌మన్ గిల్(64, 43, 98 పరుగులు) చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?! A remarkable over from @mdsirajofficial, bagging #Mayers and #Brooks while only giving away one run. Spectacular. Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/mFZVgPOkbC — FanCode (@FanCode) July 27, 2022 -
IND Vs WI 3rd ODI: విండీస్‌పై భారత్ గెలుపు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా... కుర్రాళ్లు సత్తా చాటడంతో విండీస్‌ను 3–0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. రెండు హోరాహోరీ వన్డేల తర్వాత చివరి పోరులో ఆతిథ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 119 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) విండీస్‌ను చిత్తు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను కుదించారు. ముందుగా భారత్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (98 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శిఖర్ ధావన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం డక్‌వర్త్–లూయిస్ పద్ధతి ప్రకారం వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అయితే విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. నికోలస్ పూరన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెండన్ కింగ్ (37 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. సిరాజ్ తన తొలి ఓవర్లోనే మేయర్స్ (0), బ్రూక్స్ (0)లను అవుట్ చేయడంతో ‘సున్నా’కే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది. యజువేంద్ర చహల్ (4/17) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... సిరాజ్, శార్దుల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 64, 43, 98 నాటౌట్ (మొత్తం 205) పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. విండీస్ గడ్డపై ఆ జట్టును వన్డేల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఇదే తొలిసారి. -
విండీస్‌పై టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
నరాలు తెగే ఉత్కంఠ.. విండీస్‌పై టీమిండియా విజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అవే జట్లు.. అదే ఉత్కంఠ.. వెస్టిండీస్-టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ విజయం కోసం ఆఖరి ఓవర్ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కాకపోతే మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు పోరాడితే.. నేడు టీమిండియా పోరాడింది. అయితే ఫలితం మాత్రం మారలేదు.మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టీమిండియా 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది. 3 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ పటేల్ సిక్సర్ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో టీమిండియా దక్కించుకుంది. భారత బ్యాట్స్మెన్లలో అక్షర్ పటేల్ 35 బంతుల్లో 64 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శామ్సన్ 54, శుభమన్ గిల్ 43, దీపక్ హుడా 33 పరుగులతో రాణించారు. 300 పైచిలుకు స్కోరు చేసిన వెస్టిండీస్ భారత బౌలింగ్‌ను కరీబియన్లు మళ్లీ ఓ ఆటాడుకున్నారు. దీంతో అవలీలగా మళ్లీ రెండో వన్డేలోనూ వెస్టిండీస్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. కెరీర్లో 100వ వన్డే ఆడుతున్న ఓపెనర్ షై హోప్ (135 బంతుల్లో 115; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. తొలి బంతి నుంచి 49వ ఓవర్‌దాకా విండీస్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో 74; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ @244 వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో బరిలో దిగడం ద్వారా భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 244వ క్రికెటర్‌గా అవేశ్ ఖాన్ గుర్తింపు పొందాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ చేతుల మీదుగా అవేశ్ టోపీని అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అవేశ్ ఖాన్ ఇప్పటివరకు భారత్ తరఫున 9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 -
శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడు: కోహ్లి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: రెండో వన్డేలో యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడని టీమిండియా కెప్టెన్ కోహ్లి కితాబిచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బీసీసీఐ వెబ్సైట్ కోసం సహచరుడు యజువేంద్ర చహల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ... ‘బ్యాటింగ్ ఆర్డర్లో టాప్–3 బ్యాట్స్‌మెన్‌లో ఒకరైనా నిలబడి భారీస్కోరు చేస్తేనే ఇన్నింగ్స్ నిలబడుతుంది. ఓపెనర్లు శిఖర్, రోహిత్ విఫలమవడంతో ఇన్నింగ్స్ బాధ్యత నేను తీసుకున్నా. పిచ్, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 270 పరుగుల స్కోరు మంచి లక్ష్యమే అనుకున్నాం. ముందుగా బ్యాటింగ్ తీసుకుని మంచి పనే చేశాం. మీరు విండీస్ ఇన్నింగ్స్‌ను గమనిస్తే అదే అర్థమవుతుంది. లక్ష్యఛేదనలో ఆతిథ్య జట్టు తెగ కష్టపడింది. ఆ సమయంలో ఎవరికైనా బ్యాటింగ్ క్లిష్టమే అవుతుంది. హెట్‌మైర్, పూరన్ నిలదొక్కుకుంటున్న సమయంలో వాన పడటం కూడా మాకు కలిసొచ్చింది. ఈ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి బ్యాట్స్‌మెన్ ఉండటం వల్లే చహల్‌ను కాదని కుల్దీప్ను తీసుకున్నాం. ఈ ఎత్తుగడ కూడా మమ్మల్ని గెలిపించేందుకు దోహదపడింది’ అని అన్నాడు. వర్షం, బ్రేక్ సమయంలో తన డ్యాన్సింగ్పై మాట్లాడుతూ ‘విండీస్ సంగీతం వినపడగానే నా రెండు కాళ్లు ఆగవు. చిందులేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఆట విరామంలో ఈ సరదా కూడా ఉత్సాహపరుస్తుంది’ అని అన్నాడు. -
నంబర్‌వన్ చేజారినట్లే
భారత్, వెస్టిండీస్ టెస్టు నాలుగో రోజూ వర్షార్పణం పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ నాలుగోరోజు కూడా వర్షార్పణం కావటంతో.. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు భారత్ చేజారనుంది. గతవారం శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 0-3తో ఓడిపోవటంతో భారత్ మొదటి స్థానానికి ఎగబాకింది. దీనిని కాపాడుకోవడానికి భారత్ ఈ టెస్టు గెలవాల్సి ఉంది. కానీ అనూహ్యంగా మూడున్నర రోజులపాటు వర్షం కారణంగా ఆట సాగలేదు. తొలివన్డేలో ఆస్ట్రేలియా విజయం: శ్రీలంకతో కొలంబోలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్లతో గెలిచింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 228 పరుగులు చేసి నెగ్గింది.