
దుబాయ్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘స్లో ఓవర్ రేట్’ జరిమానాను ఎదుర్కొంది. న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన ఐదో టి20లో నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసినందుకు... జట్టు సభ్యులకు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ 20 శాతం జరిమానా విధించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధన 2.22 ప్రకారం... నిర్ణీత సమయం అనంతరం వేసే ప్రతీ ఓవర్‌కు 20 శాతం చొప్పున జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. తాత్కాలిక సారథి రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజులో కోతకు సమ్మతించడంతో విచారణ చేయలేదు. నాలుగో టి20లోనూ భారత్ 2 ఓవర్లు ఆలస్యంగా వేయడంతో... మ్యాచ్ రిఫరీ భారత ఆటగాళ్లకు 40 శాతం జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment