న్యూజిలాండ్ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికారిక టెస్టులో తలపడనున్న భారత్ ‘ఎ’ జట్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉంటుందని ఆరుగురు టెస్టు జట్టు సభ్యులను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఇటీవల చాలా ఎక్కువగా క్రికెట్ ఆడుతున్న రోహిత్‌కు తగినంత విశ్రాంతి అవసరమని బోర్డు వైద్య బృందం నివేదిక ఇవ్వడంతో అతడు ‘ఎ’ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల మ్యాచ్ జరగనుండగా... 21న ఆస్ట్రేలియాతో భారత్ తొలి టి20 మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 16న భారత సీనియర్ జట్టుతో పాటు రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరతాడు.
Comments
Please login to add a commentAdd a comment