
టాస్ వేస్తున్న మార్క్‌రమ్
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్ విజయానికి అడుగు దూరంలో ఉన్న కోహ్లి సేన ఎలాగైన ఈ మ్యాచ్ గెలిచి రికార్డు సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇరు జట్లలో స్వల్ప మార్పు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో గాయంతో కేదార్ జాదవ్ దూరం కాగా అతని స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు.
ఇక ఆతిథ్య జట్టులోకి ఏబీ డివిలియర్స్, మోర్కెల్ రాగా జోండో, ఇమ్రాన్ తాహీర్‌లకు ఉద్వాసన పలికారు. ఇక ఏబీ రాకతో ప్రొటీస్ జట్టులో ఆత్మవిశ్వాసం నెలకొంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ కాపాడుకోవాలని సఫారీ జట్టు భావిస్తోంది.
తుది జట్ల వివరాలు
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, పాండ్యా, శ్రేయస్ అయ్యర్, ధోని, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, చహల్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, బెహర్దీన్, మిల్లర్, మోరిస్, ఫెలుక్‌వాయో, రబడ, మోర్కెల్, లుంగి ఎంగిడి
Comments
Please login to add a commentAdd a comment