తిరువనంతపురం: సరైన హాజరులేని కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు సీకే వినీత్‌కు కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. అతనికి స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర సచివాలయంలోని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఆడిటర్‌గా పని చేసిన వినీత్ తన ప్రాక్టీస్, అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా విధులకు సరిగ్గా హాజరు కాలేకపోయాడు. దీంతో అతడిని గతేడాది మేలో కేంద్ర ప్రభుత్వ విధుల నుంచి తొలగించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి విజయన్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరినా లాభం లేకపోవడంతో.. అతనికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment