ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే
స్టావెంజర్ (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో అలెగ్జాండర్ గ్రిస్చుక్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను విషీ 41 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ అనంతరం ఆనంద్ 1.5 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్ నల్లపావులతో సిసిలియన్ వ్యూహంతో ఆడితే... భారత ప్లేయర్ డొమినిగ్వేజ్ వేరియషన్‌ను అవలంభించాడు. పరస్పరం కొన్ని ఎత్తుల తర్వాత రష్యా ఆటగాడికి గెలిచే అవకాశాలు వచ్చినా.. నిర్ణీత సమయంలోగా ఎత్తులు వేయలేకపోయాడు.
క్వీన్ ట్రేడ్ చేసుకోవడంతో ఆనంద్ గేమ్‌పై పట్టు సాధించినా.. గ్రిస్చుక్ అద్భుతమైన డిఫెన్స్‌తో డ్రా వైపు తీసుకెళ్లాడు. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ (నార్వే)... అనిష్ గిరి (నెదర్లాండ్స్-2)తో జరిగిన గేమ్‌ను 78 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో తపలోవ్ (బల్గేరియా-2.5)... లాగ్రావీ (ఫ్రాన్స్-1.5)పై; నకమురా (అమెరికా-2.5)... ఫ్యాబియానో కరుణ (ఇటలీ-1.5)పై గెలవగా, అరోనియన్ (ఆర్మేనియా-1)... హమ్మర్ (నార్వే-1)ల మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది.