సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో డ్రా నమోదు చేశాడు. మాక్సీమ్ వాచిర్ లాగ్రావీ (ఫ్రాన్స్)తో
సెయింట్ లూయిస్: సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో డ్రా నమోదు చేశాడు. మాక్సీమ్ వాచిర్ లాగ్రావీ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను విషీ 42 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. దీంతో రెండు పరాజయాలు, మూడు డ్రాలతో ఓవరాల్‌గా ఆనంద్ ఒకటిన్నర పాయిం ట్లతో జాబితాలో చివరి స్థానంలో ఉన్నాడు.