Indian Grandmaster Viswanathan Anand
-
ఆనంద్‌కు తొమ్మిదో స్థానం
* లండన్ క్లాసిక్ చెస్ టోర్నీ * చాంపియన్ కార్ల్సన్ లండన్: ప్రపంచ చెస్ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2015 సీజన్‌ను నిరాశజనకంగా ముగించాడు. లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ 3.5 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో తలపడిన ఆనంద్ గేమ్‌ను 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్ల్సన్, అనీష్ గిరి, మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కార్ల్సన్ నేరుగా ఫైనల్‌కు వెళ్లగా... అనీష్, లాగ్రెవ్ మధ్య సెమీఫైనల్‌ను నిర్వహించారు. సెమీస్‌లో లాగ్రెవ్ 2-1తో అనీష్ గిరిని ఓడించి కార్ల్సన్తో ఫైనల్లో తలపడ్డాడు. ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో కార్ల్ సన్ 1.5.-0.5తో లాగ్రెవ్ను ఓడించి లండన్ క్లాసిక్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ టైటిల్‌తోపాటు గ్రాండ్ చెస్ టూర్లోనూ కార్ల్‌సన్‌కే టైటిల్ దక్కింది. నార్వే ఓపెన్, సింక్యూఫీల్డ్ కప్, లండన్ క్లాసిక్ టోర్నీలను కలిపి గ్రాండ్ చెస్ టూర్‌గా పరిగణించారు. ఈ మూడు టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా కార్ల్సన్ మొత్తం 26 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఆనంద్ 14 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
ఆనంద్‌కు మూడో డ్రా
సెయింట్ లూయిస్: సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో డ్రా నమోదు చేశాడు. మాక్సీమ్ వాచిర్ లాగ్రావీ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను విషీ 42 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. దీంతో రెండు పరాజయాలు, మూడు డ్రాలతో ఓవరాల్‌గా ఆనంద్ ఒకటిన్నర పాయిం ట్లతో జాబితాలో చివరి స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే
స్టావెంజర్ (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో అలెగ్జాండర్ గ్రిస్చుక్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను విషీ 41 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ అనంతరం ఆనంద్ 1.5 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్ నల్లపావులతో సిసిలియన్ వ్యూహంతో ఆడితే... భారత ప్లేయర్ డొమినిగ్వేజ్ వేరియషన్‌ను అవలంభించాడు. పరస్పరం కొన్ని ఎత్తుల తర్వాత రష్యా ఆటగాడికి గెలిచే అవకాశాలు వచ్చినా.. నిర్ణీత సమయంలోగా ఎత్తులు వేయలేకపోయాడు. క్వీన్ ట్రేడ్ చేసుకోవడంతో ఆనంద్ గేమ్‌పై పట్టు సాధించినా.. గ్రిస్చుక్ అద్భుతమైన డిఫెన్స్‌తో డ్రా వైపు తీసుకెళ్లాడు. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే)... అనిష్ గిరి (నెదర్లాండ్స్-2)తో జరిగిన గేమ్‌ను 78 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో తపలోవ్ (బల్గేరియా-2.5)... లాగ్రావీ (ఫ్రాన్స్-1.5)పై; నకమురా (అమెరికా-2.5)... ఫ్యాబియానో కరుణ (ఇటలీ-1.5)పై గెలవగా, అరోనియన్ (ఆర్మేనియా-1)... హమ్మర్ (నార్వే-1)ల మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది. -
ఆనంద్‌కు తొలి విజయం
బాడెన్-బాడెన్ (జర్మనీ): గ్రెన్‌కె క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. డేవిడ్ బారామిద్జె (జర్మనీ)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 65 ఎత్తుల్లో గెలుపొందాడు. తొలి మూడు రౌండ్లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్... నాలుగు, ఐదో రౌండ్ గేముల్లో ఓటమి పాలయ్యాడు. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ ఓడినా...
బిల్బావో (స్పెయిన్): మరో రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ ఖాయం కావడంతో... చివరి రౌండ్‌ను తేలిగ్గా తీసుకున్నాడో ఏమోగానీ బిల్బావో మాస్టర్స్ ఫైనల్ చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమితో ముగించాడు. గత ఏడాది విజేత లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా)తో శనివారం జరిగిన చివరిదైన ఆరో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 46 ఎత్తుల్లో ఓడిపోయాడు. నలుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ 11 పాయింట్లతో విజేతగా నిలువగా... అరోనియన్ 10 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. పొనమరియోవ్ (ఉక్రెయిన్), ఫ్రాన్సిస్కో వలెజో ఐదేసి పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు.