
చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు పతకం గెలిచే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. జార్జియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్‌లో బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోగా... ఇటలీతో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది.
పురుషుల జట్టులో అరోనియన్‌తో ఆనంద్; సర్గిసియాన్‌తో హరికృష్ణ; మెల్కుమ్యాన్‌తో ఆధిబన్ ‘డ్రా’ చేసుకోగా... మర్టిరోసియాన్ చేతిలో శశికిరణ్ ఓడిపోయాడు. మహిళల విభాగంలో జిమినా ఓల్గాతో కోనేరు హంపి; మోవిలెనుతో పద్మిని గేమ్‌లు ‘డ్రా’గా ముగించారు. సెడీనాపై హరిక గెలుపొందగా... బ్రునెలో చేతిలో తానియా ఓటమి చవిచూసింది. తొమ్మిదో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు 15వ స్థానంలో... మహిళల జట్టు 16వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment