కూలిడ్జ్: టి20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు... డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (37 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించింది. రాధా యాదవ్ (2/13), పూనమ్ యాదవ్ (2/17), తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (2/36) ప్రత్యర్థిని కట్టడి చేశారు. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 75 పరుగులుగా నిర్దేశించారు. మిథాలీ రాజ్ (0), జెమీమా రోడ్రిగ్స్ (1), తాన్యా భాటియా (5) విఫలమైనా... స్మృతి మంధాన (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 18; 2 ఫోర్లు) నిలవడంతో భారత్ మరో 3 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది.
మహిళల క్రికెట్‌పై పుస్తకం...
‘ది ఫైర్ బర్న్స్ బ్లూ; ఎ హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా’ శీర్షికన భారత్‌లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై ఓ పుస్తకం రానుంది. స్పోర్ట్స్ జర్నలిస్టులు కారుణ్య కేశవ్, సిద్ధాంత పట్నాయక్ రచించిన ఈ పుస్తకం ఈ నెల 30న మార్కెట్‌లో విడుదల కానుంది. వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ముద్రిస్తోంది. 1970ల నుంచి నేటి వరకు మహిళల క్రికెట్ ప్రస్థానాన్ని ఇందులో వివరించనున్నారు. లుపు
Comments
Please login to add a commentAdd a comment