న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత, భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి సీమా పూనియా రియో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న త్రోయర్స్ క్లాసిక్ -2016లో సీమా పూనియా 62.62 మీటర్లు విసిరి రియోకు ఎంపికైంది. రియోకు అర్హతకు 61.00 మీటర్లు మాత్రమే ప్రామాణికం కాగా, సీమా మరో మీటర్పైగా విసిరి సత్తా చాటింది. ఇది సీమాకు మూడో ఒలింపిక్స్. అంతకుముందు 2004, 2012లలో ఒలింపిక్స్ల్లో సీమా పాల్గొంది.