
రాంచీ: వరుస పరాజయాలతో సతమతమౌతున్న ఆస్ట్రేలియా జట్టును, మరో చిన్న గాయం ఆందోళనకు గురిచేసింది. టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమౌతుండగా, ప్రాక్టీస్ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజానికి గాయమైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టులో అలజడి మొదలైంది. దీంతో వెంటనే స్మిత్‌ను స్థానిక ప్రవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షలు జరిపించారు. అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ కూడా చేయించారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎటువంటి సమస్యలేదని, స్మిత్ ఫిట్‌గా ఉన్నాడని మ్యాచ్‌లో నిరభ్యరంతంగా పాల్గొనచ్చని ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా బృందంలో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది.
ఇప్పటికే 4-1 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన స్మిత్ సేన ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమౌతోంది. టీ20 సిరీస్‌నైనా గెలవాలని భావిస్తోంది. దీనికోసం ఆస్ట్రేలియా జట్టులో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ శనివారం రాంచీలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment