న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రీడల భవిష్యత్ గందరగోళంగా మారిందని భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. టీకా అందుబాటులోకి వచ్చే వరకు ఇప్పట్లో ఎలాంటి పెద్ద టోర్నీలు జరిగే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు. ‘వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు ప్రపంచంలో ఎలాంటి పెద్ద టోర్నీలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనాతో అందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. ప్రతీది అనుమానంగానే అనిపిస్తోంది. వీటితో పాటు ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అన్ని క్రీడా సమాఖ్యలు తలపట్టుకుంటున్నాయి. కరోనాను ఎలా నివారించాలో స్పష్టంగా తెలిశాకే ఈ అనిశ్చితి దూరమవుతుంది’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment