
న్యూఢిల్లీ: ఈ నెల 18న నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసింది. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. ఇదే మొత్తంలో ఉన్న 9 మంది (బ్రెండన్ మెకల్లమ్, వోక్స్, లసిత్ మలింగ, షాన్ మార్‡్ష, కొలిన్ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, స్యామ్ కరన్, డార్సీ షార్ట్) క్రికెటర్లందరూ విదేశీయులే.
విశేషమేమంటే, గతేడాది రూ.11.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతమై అత్యధిక ధర పలికిన భారత క్రికెటర్‌గా నిలిచిన పేసర్ జైదేవ్ ఉనాద్కట్... ఈసారి రూ.కోటిన్నరకే వేలానికి వచ్చాడు. వెటరన్ డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్, స్పిన్నర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పేసర్ మొహమ్మద్ షమీ రూ.కోటికి, పేసర్ ఇషాంత్ శర్మ రూ.75 లక్షలకు, చతేశ్వర్ పుజారా, హనుమ మిహారి రూ.50 లక్షల ప్రాథమిక మొత్తానికి జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment