ఐపీఎల్ 2024 సీజన్‌లో ఓ కీలక మ్యాచ్‌పై సందిగ్దత నెలకొంది. ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రామ నవమి, సార్వత్రిక ఎన్నికల కారణంగా రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. రామ నవమి ఉత్సవాలు కోల్‌కతాలో ఘనంగా జరుగనుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. భద్రత కోసం భారీ సంఖ్యలో పోలీసులను మొహరించాల్సి ఉంటుంది.
దీంతో ఆ రోజు మ్యాచ్‌కు తగినంత భద్రత కల్పించడం సాధ్యపడదేమో అని బీసీసీఐ భావిస్తుంది. అదే సమయంలో ఎన్నికల హడావుడి కూడా ఉంటుంది కాబట్టి మ్యాచ్‌ను వాయిదా వేసే బాగుంటుందన్నది బీసీసీఐ యోచన్‌గా తెలుస్తుంది. ఈ విషయంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ.. కోల్‌కతా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. చర్చలు కొలిక్కి రాగానే బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న బీసీసీఐ.. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లకు ముందుగానే విషయాన్ని చేరవేసింది.
కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు విడతల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుడదనే ఉద్దేశంతో ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం రెండో విడత ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలి విడతలో 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగా.. తర్వాతి దశలో మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ మొత్తం రిలీజైంది. బీసీసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షెడ్యూల్ రిలీజ్ చేసినా కేకేఆర్, రాయల్స్ మ్యాచ్ ఇరకాటంలో పడింది.
ఇదిలా ఉంటే, 13 మ్యాచ్‌ల అనంతరం కేకేఆర్ టాప్ పోజిషన్‌లో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించినప్పటికీ రన్‌రేట్ కాస్త తక్కువగా ఉండటం కారణంగా మూడో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన సీఎస్‌కే ఈ రెండు జట్ల మధ్య రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment