‘నా కష్టం వారికేం తెలుసు’ | IPL 7: Yusuf Pathan blasts record half century | Sakshi
Sakshi News home page

‘నా కష్టం వారికేం తెలుసు’

Published Mon, May 26 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

‘నా కష్టం వారికేం తెలుసు’

‘నా కష్టం వారికేం తెలుసు’

 కోల్‌కతా: రెండేళ్లుగా కొనసాగుతున్న వైఫల్యాలకు ఒక్క ఇన్నింగ్స్‌తో జవాబు చెప్పాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించి యూసుఫ్ మళ్లీ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తిరిగి గాడిలో పడేందుకు తాను ఎంతగా శ్రమిస్తున్నానన్నది తనపై విమర్శలు చేసే వారికి తెలియదని యూసుఫ్ అన్నాడు. విమర్శలు చేస్తేనే వారికి ఫీజు లభిస్తుందని, ఆడినందుకు తనకు లభిస్తుందని, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తున్నామని తెలిపాడు. ‘ఎవరేం మాట్లాడినా... నా పనేంటో, సామర్థ్యమేంటో నాకు తెలుసు. నెట్స్‌లోనూ, మ్యాచ్‌లు లేని ఖాళీ సమయాల్లోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇతరులు మాట్లాడే వాటి గురించి పట్టించుకోను’ అని యూసుఫ్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement