సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ 11వ సీజన్‌కు ఇంక కొన్ని రోజులే మిగులున్నాయి. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్11 సీజన్ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ముంబయిలో ఆరంభం కానుంది. ఆ తరువాత తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్ 11వ ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలకు కౌంటర్లు తెరచినట్లు ముంబయి ఫ్రాంఛైజీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ముంబయి ఇండియన్స్ సైట్ నుంచి ఆన్‌లైన్లో టిక్కెట్లు కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది.
టిక్కెట్ల ధరల విషయానికొస్తే.. కనిష్ఠంగా రూ.800 నుంచి గరిష్ఠంగా 8,000 మధ్య వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఏప్రిల్ 14న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగే మ్యాచ్ టిక్కెట్లను రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘అందరికీ విద్య - అందరికీ క్రీడలు’ ఉద్దేశంతో అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. దీంతో ఆ రోజు మినహా మిగతా రోజులకు కొనుగోలుకు అవకాశం కల్పించింది. ఐపీఎల్ 10 లీగ్‌ను రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment