అది మాకు అతిపెద్ద ఛాలెంజ్: డివిలియర్స్ | It would be challenging to maintain momentum, ab De Villiers | Sakshi
Sakshi News home page

అది మాకు అతిపెద్ద ఛాలెంజ్: డివిలియర్స్

Published Sat, Oct 10 2015 4:10 PM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

అది మాకు అతిపెద్ద ఛాలెంజ్: డివిలియర్స్

అది మాకు అతిపెద్ద ఛాలెంజ్: డివిలియర్స్

కాన్పూర్:ఇప్పటికే ట్వంటీ 20 సిరీస్ ను గెలిచి పూర్తి విశ్వాసంతో ఉన్న దక్షిణాఫ్రికా ముందు అసలైన ఛాలెంజ్ వన్డేల రూపంలో ఉందని వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు.  ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా మరింత కసిగా వన్డే సిరీస్ కు సన్నద్ధమవుతుందనడంలోఎటువంటి సందేహం లేదని డివిలియర్స్ తెలిపాడు.

 

'ఒక గొప్ప సిరీస్ లో మాకు శుభారంభం లభించినందకు ఆనందంగా ఉంది. అదే ఆటతీరును వన్డేల్లో కూడా కొనసాగించడానికి పూర్తి స్థాయిలో యత్నిస్తాం. ఇప్పుడు మా ముందు వన్డే సిరీస్ రూపంలో అతి పెద్ద ఛాలెంజ్ ఉంది. వన్డే సిరీస్ ను కూడా గెలుస్తామని నమ్మకంగా ఉన్నాం. టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. పలురకాలైన గ్రౌండ్లలో , వివిధ రకాలైన వికెట్లపై ఆడాలి. ఇప్పుడు అది కచ్చితంగా మాకు ఒక ఛాలెంజ్. భారత్ ను స్వదేశంలో కట్టడి చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతాం. సిరీస్ ను గెలవడమే మాకు ఇష్టం.  టీమిండియా కూడా మమ్మల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతుంది' అని డివిలియర్స్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement