అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో విజయాలను అందించిన జస్‌ప్రీత్ బుమ్రా, అంతర్జాతీయ మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయంలో కనీసం 10 పరుగులకు మించి చేయలేకపోయాడు. బ్యాటింగ్ సగటును చూస్తే, టెస్టుల్లో 2.9, వన్డేల్లో 3.8, టీ20ల్లో 4 పరుగులతో చాలా పేలవ ప్రదర్శనను కనబరిచాడు. ఇక ఇదే విషయమై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సరదాగా చేసిన కామెంట్లపై భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అంతే సరదాగా ట్విటర్‌లో సమాధానం ఇచ్చాడు. చాలా మంది కోరిక మేరకు, ముఖ్యంగా యూవీ కోసం ఈ వీడియో అంటూ.. 2017లో గుజరాత్, గోవా మధ్య జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. గుజరాత్ తరపున బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా 24 బంతుల్లో 42 పరుగులు చేసి గెలపులో కీలక పాత్ర పోషించాడు. భారీ షాట్‌లతో గోవా బౌలర్‌కు చుక్కులు చూపించాడు. గ్రౌండ్ నలుమూలలా బౌండరీలను కొడుతూ, ఓ ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్‌లా ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీ20ల్లో బుమ్రాను ఓపెనింగ్ పంపాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
On popular demand (mostly by @YUVSTRONG12), here’s presenting, Jasprit Bumrah’s match winning knock of 2017! pic.twitter.com/gnaSrZUOWn
— Jasprit Bumrah (@Jaspritbumrah93) April 28, 2020
ఇక, సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో యువరాజ్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా మధ్య లైవ్‌లో ఆసక్తికర చర్చజరిగింది.(బుమ్రాకు ‘చుక్కలు’ చూపించాడు..!) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తనను పోల్చి ఎవరూ బెస్ట్ ఫినిషరో చెప్పాలని ఇబ్బందిపెట్టే ప్రశ్నను బుమ్రాకు యువీ సంధించాడు. దీనికి సమాధానంగా వీరిద్దరిని పోల్చడం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరినే ఎంచుకోవాలని అన్నట్లుగా ఉంటుందని బుమ్రా స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడు. తన విలక్షణమైన బౌలింగ్ శైలి కారణంగా క్రికెట్‌లో ఎక్కువకాలం కొనసాగలేవని చాలామంది అనేవారని బుమ్రా గుర్తు చేసుకున్నాడు. ఒకట్రెండు రంజీలకు మించి ఆడలేవని తనను నిరాశపర్చేవారని పేర్కొన్నాడు. ఈక్రమంలో టీమిండియాకు ఎంపికయ్యే సవాలే లేదని చాలా మంది అనేవారని గుర్తుచేసుకున్నాడు.
వెంటనే బుమ్రాపై యువీ ప్రశంసలు కురిపించాడు. ఎవరేమనుకున్నా మూడు ఫార్మాట్లలో వరల్డ్ నెం.1 అయ్యే సామర్థ్యం బుమ్రాలో ఉందని కితాబిచ్చాడు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా, లక్ష్యంపై దృష్టి పెడితే రెండేళ్లలోనే బుమ్రా ఈ ఘనతను సాధించే అవకాశముందని యువీ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment