
హైదరాబాద్: సమష్టి కృషితోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ట్రోఫీని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుందని ఆ జట్టు ప్రధాన కోచ్ మహేళ జయవర్దనే పేర్కొన్నాడు. బహుమతి ప్రధానాత్సోవం అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లును ఉద్దేశించి ప్రసంగించాడు. దీనిక సంబంధించిన వీడియో ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆటగాళ్లు తప్పిదాలు చేశారని.. కానీ త్వరగా కోలుకొని అద్భుత ప్రదర్శనిచ్చారని కొనియాడాడు. టోర్నీ ఆసాంతం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను సొంత కుటుంబ సభ్యుల్లా ఆకాశ్, నీతా అంబానీలు చూసుకున్నారని ప్రశంసించాడు.
‘మన జట్టులో ఒక్క ఆటగాడు కూడా ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు. కానీ కప్ గెలిచాం. సమిష్టిగా ఆడి విజయం సాధించాం. చెన్నై మ్యాచ్‌లో మనం అనేక తప్పిదాలు చేశాం. కానీ త్వరగా కోలుకొని అత్యుత్తమ ప్రదర్శననిచ్చాం. ఐపీఎల్ 12 గెలవడంలో ప్రతీ ఒక్క ఆటగాడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు’అంటూ జయవర్దనే ప్రసంగించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ పోరులో సీఎస్‌కేపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు ఐపీఎల్ టోర్నీలు కైవసం చేసుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు కానీ కప్ గెలిచాం
Comments
Please login to add a commentAdd a comment