ఇంగ్లండ్‌ ఎదురీత | Joe Root falls just before day four stumps to leave England trailing New Zealand by 237 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ఎదురీత

Published Mon, Mar 26 2018 4:32 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Joe Root falls just before day four stumps to leave England trailing New Zealand by 237 - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఎదురీదుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆ జట్టు కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు మరో 237 పరుగులు వెనుకబడి ఉంది. ఈ డే–నైట్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమిని తప్పించుకోవాలంటే ఐదో రోజు మొత్తం బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. అంతకుముందు న్యూజిలాండ్‌ 427/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. దీంతో ఆ జట్టుకు 369 పరుగుల ఆధిక్యం లభించింది. నికోల్స్‌ (145 నాటౌట్‌; 18 ఫోర్లు) భారీ శతకంతో ఆకట్టుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement