న్యూఢిల్లీ: దేశంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పని చేయాల్సి ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయ పడ్డారు. ఇందులో భాగంగా క్రీడలను ఉమ్మడి జాబితాలో చేర్చాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. గురువారం వేర్వేరు క్రీడల జాతీయ సమాఖ్యలతో ఆయన సమావేశం నిర్వహించారు. 20కు పైగా సమాఖ్యల ప్రతినిధులు హాజరై ఉమ్మడి జాబితాకు మద్దతుగా తీర్మానం చేశారు.
ప్రస్తుతం క్రీడలు కేంద్ర జాబితాలో ఉన్నారుు. అరుుతే 2009లోనూ కేంద్రం ఇదే ప్రయత్నం చేసినా... రాష్ట్రాలు ముందుకు రాకపోవడం, ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో ప్రభుత్వం బిల్లును పక్కన పెట్టేసింది. ఈ సారి మాత్రం రాష్ట్రాలను ఒప్పిస్తామని గోయల్ చెప్పారు. మరో వైపు ‘ఇతర’ క్రీడల జాబితాలో ఉన్న వేర్వేరు క్రీడాంశాలకు నిధులను పునరుద్ధరించాలని కూడా నిర్ణరుుంచారు. వీటిని 2014లో ఆపేశారు.