సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) పోటీల్లో హైదరాబాద్ బాక్సర్ జూహియా అఫ్రీన్ బంగారు పతకం సాధించింది. తద్వారా జాతీయ స్కూల్ గేమ్స్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపికైంది. వరంగల్‌లో బుధవారం జరిగిన బాలికల 60-63 కేజీల కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె తన ప్రత్యర్థిని కేవలం 20 సెకన్లలోనే కంగుతినిపించింది. ఎన్ఏఎస్ఆర్ స్కూల్ విద్యార్థి అయిన జూహియా ఎల్బీ స్టేడియంలో కోచ్ ఓంకార్‌నాథ్ యాదవ్ దగ్గర శిక్షణ తీసుకుంది.
జూహియాకు స్వర్ణం
Published Thu, Sep 22 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement
Advertisement