sgf games
-
ఉల్లాసంగా..ఉత్సాహంగా
బుచ్చిరెడ్డిపాళెం : స్థానిక డీఎల్ఎన్ఆర్ పాఠశాల క్రీడామైదానంలో 63వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం 12 జిల్లాల క్రీడాకారులను అధికారులు, నేతలు పరిచయం చేసుకుని ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల క్రీడా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్‌బాషా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కే కోటేశ్వరమ్మ, అబ్జర్వర్ సీ మాల్రెడ్డి, సర్పంచ్ జూగుంట స్నేహలత, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకుడు భీమతాటి వెంకటరమణయ్య, జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే...బాలుర విభాగంలో కృష్ణాపై వైజాగ్, విజయనగరంపై శ్రీకాకుళం, ప్రకాశంపై, తూర్పుగోదావరి, చిత్తూరుపై గుంటూరు జట్లు విజయం సాధించాయి. అలాగే పశ్చిమగోదావరిపై కడప, కృష్ణాపై, కర్నూల్, శ్రీకాకుళంపై నెల్లూరు, కడపపై గుంటూరు, అనంతపురంపై తూర్పుగోదావరి జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో.. కడపపై చిత్తూరు, కర్నూలుపై ప్రకాశం, శ్రీకాకుళంపై వైజాగ్, కృష్ణాపై పశ్చిమగోదావరి జట్లు విజయం సాధించాయి. అలాగే చిత్తూరుపై తూర్పుగోదావరి, నెల్లూరుపై విజయనగరం జట్లు గెలుపొందాయి. కాగా విజయనగ రం–గుంటూరు జట్ల మధ్య జరిగిన పోటీ టైగా ముగిసింది. -
రంగారెడ్డి ఖో–ఖో జట్ల డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్–19 ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా జట్లు డబుల్ ధమాకా సాధించాయి. బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచాయి. సరూర్ నగర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి జట్టు 10–6తో వరంగల్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి 12–6తో ఆదిలాబాద్‌పై, వరంగల్ జట్టు 6–4తో ఖమ్మంపై గెలుపొందాయి. బాలికల తుదిపోరులో రంగారెడ్డి 4–2తో మహబూబ్‌నగర్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో రంగారెడ్డి అమ్మాయిలు 6–2తో కరీంనగర్ జట్టుపై, మహబూబ్‌నగర్ 8–3తో వరంగల్‌పై విజయం సాధించాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు బాలబాలికల జట్లకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. -
ఎస్జీఎఫ్ క్రికెట్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) అంతర్ జిల్లా బాలికల క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్‌గా నిర్వహించిన ఈ అండర్–19 టోర్నీ ఫైనల్లో హైదరాబాద్ బాలికల జట్టు 15 పరుగుల తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టుపై గెలిచింది. సైనిక్‌పురిలోని శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో జరిగిన టైటిల్ పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రంగారెడ్డి జట్టు 111 పరుగుల వద్ద ఆలౌటైంది. -
జూహియాకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) పోటీల్లో హైదరాబాద్ బాక్సర్ జూహియా అఫ్రీన్ బంగారు పతకం సాధించింది. తద్వారా జాతీయ స్కూల్ గేమ్స్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపికైంది. వరంగల్‌లో బుధవారం జరిగిన బాలికల 60-63 కేజీల కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె తన ప్రత్యర్థిని కేవలం 20 సెకన్లలోనే కంగుతినిపించింది. ఎన్ఏఎస్ఆర్ స్కూల్ విద్యార్థి అయిన జూహియా ఎల్బీ స్టేడియంలో కోచ్ ఓంకార్‌నాథ్ యాదవ్ దగ్గర శిక్షణ తీసుకుంది. -
జిల్లాలో ఎస్జీఎఫ్ సంబరాలు
62వ స్కూల్‌గేమ్స్ జిల్లాస్థాయి సెలక్షన్స్ ప్రారంభం ఈసారి జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి టోర్నీల కేటాయింపు అక్టోబర్‌లో జాతీయస్థాయి నెట్‌బాల్ టోర్నీకి వేదికకానున్న పాలమూరు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలో 62వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంబరాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పాఠశాలస్థాయిలో క్రీడాభివృద్ధికి 62ఏళ్ల నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా జిల్లాస్థాయి ఎంపికలు ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లాస్థాయి నెట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. ప్రతి క్రీడాంశానికి సంబంధించి జిల్లాస్థాయిలో సెలక్షన్స్ నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. జిల్లా జట్లు వచ్చేనెల నుంచి నుంచి జనవరి వరకు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో జరిగే అంతర్జిలాల్ల ఎస్జీఎఫ్ టోర్నీల్లో పాల్గొంటాయి. అనంతరం జాతీయస్థాయి టోర్నీల్లో రాష్ట్ర జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాది జిల్లాకు అండర్–14 నెట్‌బాల్, అండర్–17 వాలీబాల్ రాష్ట్రస్థాయి టోర్నీలను కేటాయించారు. అక్టోబర్ మొదటివారంలో జిల్లా కేంద్రం అండర్–14 జాతీయస్థాయి నెట్‌బాల్ టోర్నీకి వేదిక కానుంది. జిల్లాకేంద్రంలో ఈ ఏడాది జనవరిలో అండర్–14 ఎస్జీఎఫ్ జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీని విజయవంతంగా నిర్వహించారు. 2 నుంచి ఎంపికలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14 బాల, బాలికల ఫుట్‌బాల్ ఎంపికలు 2న బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో, అండర్–17 ఖోఖో ఎంపికలు 3న జిల్లా స్టేడియం (మహబూబ్‌నగర్), అండర్–14, అండర్–17 తైక్వాండో 4న గద్వాల, అండర్–14, అండర్–17 చెస్ లిటిల్‌స్కాలర్స్ (మహబూబ్‌నగర్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు మాత్రమే హాజరుకావాలని ఆయన కోరారు. గతేడాది మంచి ఫలితాలు 2015లో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీల్లో జిల్లా జట్టు మెరుగైన ఫలితాలు సాధించాయి. అండర్–14 రాష్ట్రస్థాయి హాకీలో జిల్లా బాల, బాలికల జట్లు విజేతగా నిలిచాయి. రాష్ట్రస్థాయి యోగాలో జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించాయి. అండర్–17 క్రికెట్ జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎస్జీఎఫ్లో నిర్వహించే క్రీడలు.. అండర్–17, 14 (బాలురు, బాలికలు) అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, త్రోబాల్, చెస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, తైక్వాండ్, సాఫ్ట్‌బాల్, ఆర్చరీ, స్విమ్మింగ్, టెన్నిస్, యోగా, నెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, జూడో, రెజ్లింగ్, ఫెన్సింగ్ ఎస్జీఎఫ్ కోసం అన్ని ఏర్పాట్లు ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాస్థాయి సెలక్షన్స్ నిర్వహించి ప్రతిభ క్రీడాకారులను రాష్ట్ర టోర్నీలకు పంపుతాం. మూడోసారి జిల్లాకు జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీ కేటాయించడం సంతోషంగా ఉంది. నెట్‌బాల్ జాతీయ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. –సురేశ్‌కుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి -
క్రీడా సంబరం
రేపటి నుంచి జిల్లాస్థాయి పోటీలు షెడ్యూల్ విడుదల చేసిన క్రీడా సమాఖ్యలు కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లాలో క్రీడా సంరంభం మెుదలుకానుంది. ఈనెల 27 నుంచి జిల్లాస్థాయి పోటీలకు కరీంనగర్ జిల్లా వేదికకానుంది. 2016–17 విద్యాసంత్సరానికి ఆయా క్రీడా సమాఖ్యలు పోటీల షెడ్యూళ్లు ఖరారు చేశాయి. గతేడాది జిల్లాలో పలు క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యల ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో పాఠశాలలు, కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు 15కుSపైగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించగా జూన్‌లో జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. సఖ్యత కుదిరేనా? గతేడాది జిల్లాలో పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 9 క్రీడల్లో రాష్ట్రస్థాయి, ఫుట్‌బాల్‌లో జాతీయస్థాయి పోటీలు నిర్వహించారు. అయితే పోటీల నిర్వహణలో లోపాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. క్రీడాపోటీలు విజయవంతం కావాలంటే క్రీడా సమాఖ్య కార్యదర్శికి పెటా సంఘాలు చేదోడు వాదోడుగా నిలవాలి. కానీ జిల్లాలోని పెటా సంఘాలు గతేడాది రెండుగా చీలిపోయాయి. వర్గపోరుతో బాబు శ్రీనివాస్ వర్గానికి చెందిన పీఈటీలు పోటీలను బైకాట్ చేసినట్లు ప్రవర్తించగా, సారయ్య వర్గానికి చెందిన పీఈటీలు నిర్వహణకు హాజరయ్యారు. పలు సంఘాల సాయంతో క్రీడకార్యదర్శి పోటీలను విజయవంతం చేశారు. మరీ రేపటి నుంచి నిర్వహించే పోటీలకు బాబు శ్రీనివాస్ వర్గం పీఈటీలు వస్తారా? లేదా? అన్నది చూడాలి. ఈ ఏడాది జిల్లాలో జూడో, ఫెన్సింగ్ పోటీలతోపాటు 6 క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్న క్రమంలో రెండు సంఘాలు ఒక్క తాటిపైకి రావాలని క్రీడావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మారిన నిబంధనలు క్రీడాకారుడు తప్పనిసరిగా వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్, రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారుడి వివరాలు ఆన్లైన్లో పొందుపరుచడమే కాకుండా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. బాలికల జట్టుతో తప్పకుండా మహిళ కోచ్ ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయి సర్టిఫికెట్లను ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్లో ఇవ్వనున్నారు. రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలు ఈనెల 27న సెప్టెంబర్ 21న ముగుస్తాయి. జిల్లా కళాశాలల క్రీడాపోటీలు సెప్టెంబర్ 2న ప్రారంభమై సెప్టెంబర్ 27న ముగియనున్నాయి. జాతీయస్థాయిపోటీలు జూడో : పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్–17 బాలబాలికల పోటీలు నవంబర్‌లో.. ఫెన్సింగ్ : పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్–17 బాలబాలికల పోటీలు జనవరిలో.. దక్షిణ భారత స్థాయి అథ్లెటిక్స్ జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు అక్టోబర్ 4, 5 తేదీలు. రాష్ట్రస్థాయి పోటీలు పాఠశాలల క్రీడా సమఖ్య : అక్టోబర్‌లో అండర్–14 హ్యాండ్‌బాల్, అండర్–17 బాస్కెట్‌బాల్, జూడో, ఫెన్సింగ్, అండర్ 14, 17 స్కై మార్షల్ ఆర్ట్స్, తాంగ్తా, యోగా పోటీలు. కళాశాలల క్రీడా సమాఖ్య : అక్టోబర్‌లో అండర్ 19 బాలబాలికల బాస్కెట్‌బాల్, యోగా, సైక్లింగ్, బేస్‌బాల్, స్పీడ్‌బాల్, ఫీల్డ్ అర్చరీ, డాడ్జ్‌బాల్ పోటీలు, అదే స్ఫూర్తితో.. జూన్‌లో ఫుట్‌బాల్ జాతీయ పోటీలు విజయవంతంగా నిర్వహించాం. ఈ సారి కూడా అదే స్ఫూర్తితో పోటీలు నిర్వహిస్తాం. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా జిల్లాస్థాయి నుంచి మొదలుకొని జాతీయస్థాయి వరకు నిర్వహిస్తాం. అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తాం. – పుర్మ తిరుపతిరెడ్డి, పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఘనంగా నిర్వహిస్తాం గతేడాది ఐదు క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాం. కానీ ఈసారి ఆ సంఖ్య ఏడుకు పెరిగింది. అయిన ఘనంగా నిర్వహించి తీరుతాం. జిల్లాస్థాయి పోటీలు కూడా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – జి.మధుజాన్సన్, కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి జిల్లాస్థాయి పాఠశాలల క్రీడా పోటీల షెడ్యూల్ – 27న అర్చరీ–మంథని – 28న కరాటే– కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం – 28న నెట్‌బాల్ పోటీలు – కరీంనగర్, పారమిత స్కూల్ – 29న చదరంగం– కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 29న త్రోబాల్ పోటీలు– 8ఇంక్లైన్‌కాలనీ – 30న బాక్సింగ్, బాస్కెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ పోటీలు–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 30న టేబుల్‌టెన్నీస్ – కరీంనగర్, ట్రాన్స్‌కో క్లబ్ – 31న హాకీ– హుజూరాబాద్ – 31న తైక్వాండో–జగిత్యాల – 31న ఫుట్‌బాల్ పోటీలు– కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – సెప్టెంబర్ 15న కబడ్డీ – వెంకపల్లి (సైదాపూర్) – 17న ఖోఖో– సుల్తానాబాద్ – 19న వాలీబాల్– గంగాధర – 19న అండర్ 17 బాలుర క్రికెట్– 8ఇంక్లైన్‌కాలనీ – 21 అండర్ 14 బాలుర క్రికెట్– 8ఇంక్లైన్‌కాలనీ జిల్లా స్థాయి కళాశాలల క్రీడా పోటీల షెడ్యూల్ సెప్టెంబర్ 2న చెస్, క్యారం, టెన్నిస్– కరీంనగర్, సైన్స్ కళాశాల – 3న టేబుల్‌టెన్నీస్, షటిల్– కరీంనగర్, ట్రాన్స్ కో క్లబ్ – 6న టెన్నీకాయిట్, సైక్లింగ్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 7న ఫుట్‌బాల్, రగ్బీ–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 8న కబడ్డీ –కరీంనగర్,అంబేద్కర్ స్టేడియం – 9న హాకీ–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 10న బాక్సింగ్, కిక్‌బాక్సింగ్, యోగా–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 13న స్విమ్మింగ్–అల్ఫోర్స్ కళాశాల, కొత్తపల్లి – 14న వాలీబాల్–కరీంనగర్,అంబేద్కర్ స్టేడియం – 15న ఆర్చరీ, షూటింగ్, ఫీల్డ్ ఆర్చరీ, తైక్వాండో–కరీంనగర్,అంబేద్కర్ స్టేడియం – 16న ఖోఖో–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 17న బాస్కెట్‌బాల్, సెపక్తక్రా–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 18న హ్యాండ్‌బాల్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 19న అథ్లెటిక్స్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 20న జూడో, రోప్ స్కిప్పింగ్, స్కై మార్షల్ ఆర్ట్స్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 21న క్రికెట్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 22న సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్– జగిత్యాల – 23న నెట్‌బాల్, త్రోబాల్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 24న రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, పవర్ లిఫ్టింగ్, బెల్ట్ రెజ్లింగ్ –కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 25న రోల్‌బాల్, స్కేటింగ్, ఫెన్సింగ్, వుషు, బాస్కెట్‌బాల్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 26న టగ్ ఆఫ్ వార్, కరాటే, కర్ఫ్బాల్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం – 27న డాడ్జ్‌బాల్, స్పీడ్‌బాల్, తాంగ్తా, ఫ్లోర్ బాల్, మార్షల్ ఆర్ట్స్–కరీంనగర్, అంబేద్కర్ స్టేడియం