క్రీడా సంబరం | sports feast | Sakshi
Sakshi News home page

క్రీడా సంబరం

Published Thu, Aug 25 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

క్రీడా సంబరం

క్రీడా సంబరం

  • రేపటి నుంచి జిల్లాస్థాయి పోటీలు
  • షెడ్యూల్‌ విడుదల చేసిన క్రీడా సమాఖ్యలు
  • కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : జిల్లాలో క్రీడా సంరంభం మెుదలుకానుంది. ఈనెల 27 నుంచి జిల్లాస్థాయి పోటీలకు కరీంనగర్‌ జిల్లా వేదికకానుంది. 2016–17 విద్యాసంత్సరానికి ఆయా క్రీడా సమాఖ్యలు పోటీల షెడ్యూళ్లు ఖరారు చేశాయి. గతేడాది జిల్లాలో పలు క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యల ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో పాఠశాలలు, కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు 15కుSపైగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించగా జూన్‌లో జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించారు.  
    సఖ్యత కుదిరేనా?
    గతేడాది జిల్లాలో పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 9 క్రీడల్లో రాష్ట్రస్థాయి, ఫుట్‌బాల్‌లో జాతీయస్థాయి పోటీలు నిర్వహించారు. అయితే పోటీల నిర్వహణలో లోపాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. క్రీడాపోటీలు విజయవంతం కావాలంటే క్రీడా సమాఖ్య కార్యదర్శికి పెటా సంఘాలు చేదోడు వాదోడుగా నిలవాలి. కానీ జిల్లాలోని పెటా సంఘాలు గతేడాది రెండుగా చీలిపోయాయి. వర్గపోరుతో బాబు శ్రీనివాస్‌ వర్గానికి చెందిన పీఈటీలు పోటీలను బైకాట్‌ చేసినట్లు ప్రవర్తించగా, సారయ్య వర్గానికి చెందిన పీఈటీలు నిర్వహణకు హాజరయ్యారు. పలు సంఘాల సాయంతో క్రీడకార్యదర్శి పోటీలను విజయవంతం చేశారు. మరీ రేపటి నుంచి నిర్వహించే పోటీలకు బాబు శ్రీనివాస్‌ వర్గం పీఈటీలు వస్తారా? లేదా? అన్నది చూడాలి. ఈ ఏడాది జిల్లాలో జూడో, ఫెన్సింగ్‌ పోటీలతోపాటు 6 క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్న క్రమంలో రెండు సంఘాలు ఒక్క తాటిపైకి రావాలని క్రీడావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
    మారిన నిబంధనలు
    క్రీడాకారుడు తప్పనిసరిగా వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్, రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారుడి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుచడమే కాకుండా బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టారు. బాలికల జట్టుతో తప్పకుండా మహిళ కోచ్‌ ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయి సర్టిఫికెట్లను ఈ సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ఇవ్వనున్నారు.
    రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలు ఈనెల 27న సెప్టెంబర్‌ 21న ముగుస్తాయి. జిల్లా కళాశాలల క్రీడాపోటీలు సెప్టెంబర్‌ 2న ప్రారంభమై సెప్టెంబర్‌ 27న ముగియనున్నాయి. 
    జాతీయస్థాయిపోటీలు 
    జూడో : పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్‌–17 బాలబాలికల పోటీలు నవంబర్‌లో.. 
    ఫెన్సింగ్‌ : పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్‌–17 బాలబాలికల పోటీలు జనవరిలో.. 
    దక్షిణ భారత స్థాయి అథ్లెటిక్స్‌ 
    •  జిల్లా అథ్లెటిక్‌ సంఘం ఆధ్వర్యంలో అండర్‌ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు అక్టోబర్‌ 4, 5 తేదీలు.  
    • రాష్ట్రస్థాయి పోటీలు
    పాఠశాలల క్రీడా సమఖ్య : అక్టోబర్‌లో అండర్‌–14 హ్యాండ్‌బాల్, అండర్‌–17 బాస్కెట్‌బాల్, జూడో, ఫెన్సింగ్, అండర్‌ 14, 17 స్కై మార్షల్‌ ఆర్ట్స్, తాంగ్‌తా, యోగా పోటీలు.
    కళాశాలల క్రీడా సమాఖ్య : అక్టోబర్‌లో అండర్‌ 19 బాలబాలికల బాస్కెట్‌బాల్, యోగా, సైక్లింగ్, బేస్‌బాల్, స్పీడ్‌బాల్, ఫీల్డ్‌ అర్చరీ, డాడ్జ్‌బాల్‌ పోటీలు,
     
    అదే స్ఫూర్తితో..
    జూన్‌లో ఫుట్‌బాల్‌ జాతీయ పోటీలు విజయవంతంగా నిర్వహించాం. ఈ సారి కూడా అదే స్ఫూర్తితో పోటీలు నిర్వహిస్తాం. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా జిల్లాస్థాయి నుంచి మొదలుకొని జాతీయస్థాయి వరకు నిర్వహిస్తాం. అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తాం.  
    – పుర్మ తిరుపతిరెడ్డి, పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి
     
    ఘనంగా నిర్వహిస్తాం
    గతేడాది ఐదు క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాం. కానీ ఈసారి ఆ సంఖ్య ఏడుకు పెరిగింది. అయిన ఘనంగా నిర్వహించి తీరుతాం. జిల్లాస్థాయి పోటీలు కూడా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.  
    – జి.మధుజాన్సన్, కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి
    జిల్లాస్థాయి పాఠశాలల క్రీడా పోటీల షెడ్యూల్‌ 
    – 27న అర్చరీ–మంథని 
    – 28న కరాటే– కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం 
    – 28న నెట్‌బాల్‌ పోటీలు – కరీంనగర్, పారమిత స్కూల్‌ 
    – 29న చదరంగం– కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 29న త్రోబాల్‌ పోటీలు– 8ఇంక్లైన్‌కాలనీ 
    – 30న బాక్సింగ్, బాస్కెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, స్విమ్మింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, రెజ్లింగ్‌ పోటీలు–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 30న టేబుల్‌టెన్నీస్‌ – కరీంనగర్, ట్రాన్స్‌కో క్లబ్‌ 
    – 31న హాకీ– హుజూరాబాద్‌ 
    – 31న తైక్వాండో–జగిత్యాల
    – 31న ఫుట్‌బాల్‌ పోటీలు– కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – సెప్టెంబర్‌ 15న కబడ్డీ – వెంకపల్లి (సైదాపూర్‌) 
    – 17న ఖోఖో– సుల్తానాబాద్‌ 
    – 19న వాలీబాల్‌– గంగాధర
    – 19న అండర్‌ 17 బాలుర క్రికెట్‌– 8ఇంక్లైన్‌కాలనీ 
    – 21 అండర్‌ 14 బాలుర క్రికెట్‌– 8ఇంక్లైన్‌కాలనీ 
     
    జిల్లా స్థాయి కళాశాలల క్రీడా పోటీల షెడ్యూల్‌
    సెప్టెంబర్‌ 2న చెస్, క్యారం, టెన్నిస్‌– కరీంనగర్, సైన్స్‌ కళాశాల 
    – 3న టేబుల్‌టెన్నీస్, షటిల్‌– కరీంనగర్, ట్రాన్స్‌ కో క్లబ్‌ 
    – 6న టెన్నీకాయిట్, సైక్లింగ్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 7న ఫుట్‌బాల్, రగ్బీ–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 8న కబడ్డీ –కరీంనగర్,అంబేద్కర్‌ స్టేడియం 
    – 9న హాకీ–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 10న బాక్సింగ్, కిక్‌బాక్సింగ్, యోగా–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 13న స్విమ్మింగ్‌–అల్ఫోర్స్‌ కళాశాల, కొత్తపల్లి
    – 14న వాలీబాల్‌–కరీంనగర్,అంబేద్కర్‌ స్టేడియం 
    – 15న ఆర్చరీ, షూటింగ్, ఫీల్డ్‌ ఆర్చరీ, తైక్వాండో–కరీంనగర్,అంబేద్కర్‌ స్టేడియం 
    – 16న ఖోఖో–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 17న బాస్కెట్‌బాల్, సెపక్‌తక్రా–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 18న హ్యాండ్‌బాల్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 19న అథ్లెటిక్స్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 20న జూడో, రోప్‌ స్కిప్పింగ్, స్కై మార్షల్‌ ఆర్ట్స్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 21న క్రికెట్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 22న సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్‌– జగిత్యాల 
    – 23న నెట్‌బాల్, త్రోబాల్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 24న రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, పవర్‌ లిఫ్టింగ్, బెల్ట్‌ రెజ్లింగ్‌ –కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 25న రోల్‌బాల్, స్కేటింగ్, ఫెన్సింగ్, వుషు, బాస్కెట్‌బాల్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 26న టగ్‌ ఆఫ్‌ వార్, కరాటే, కర్ఫ్‌బాల్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
    – 27న డాడ్జ్‌బాల్, స్పీడ్‌బాల్, తాంగ్‌తా, ఫ్లోర్‌ బాల్, మార్షల్‌ ఆర్ట్స్‌–కరీంనగర్, అంబేద్కర్‌ స్టేడియం 
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement