ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ చాంప్‌ హైదరాబాద్‌ | Hyderabad wins SGF Cricket trophy | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ చాంప్‌ హైదరాబాద్‌

Published Fri, Sep 29 2017 10:33 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

SGF Cricket Tourney - Sakshi

విజేతగా నిలిచిన హైదరాబాద్,రన్నరప్ తో సరిపెట్టుకున్న రంగారెడ్డి జట్లతో నిర్వాహకులు

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) అంతర్‌ జిల్లా బాలికల క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర జట్టు కోసం సెలక్షన్‌ ట్రయల్స్‌గా నిర్వహించిన ఈ అండర్‌–19 టోర్నీ ఫైనల్లో హైదరాబాద్‌ బాలికల జట్టు 15 పరుగుల తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టుపై గెలిచింది. సైనిక్‌పురిలోని శ్రీ అరబిందో జూనియర్‌ కాలేజీలో జరిగిన టైటిల్‌ పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన రంగారెడ్డి జట్టు 111 పరుగుల వద్ద ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement