జూనియర్ రొనాల్డో ప్రాక్టీస్ మొదలు | Junior Ronaldo to start practice | Sakshi
Sakshi News home page

జూనియర్ రొనాల్డో ప్రాక్టీస్ మొదలు

Published Sun, May 17 2015 12:51 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

Junior Ronaldo to start practice

ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... తన నాలుగేళ్ల కుమారుడి తో కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టించాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలో అందరికంటే ఫిట్‌గా ఉండేది ఈ పోర్చుగల్ స్టార్. అందుకే తన కుమారుడితో కూడా ఇప్పుడు ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తున్నాడు. పిల్లాడితో ఆగకుండా పది సిట్‌అప్స్ చేయించి ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

భవిష్యత్‌లో తన కుమారుడినీ ఫుట్‌బాల్ స్టార్‌ని చేయబోతున్నాననే సంకేతం ఇచ్చాడు రొనాల్డో. ఆ పిల్లాడు కూడా తండ్రి చెప్పిన ప్రతి ఎక్సర్‌సైజ్‌నూ బుద్ధిగా చేశాడు. దాదాపు అరగంటసేపు కష్టపెట్టిన తర్వాత పిల్లాడిని ఎత్తుకుని గాల్లోకి ఎగరేసి... ఆ తర్వాత గట్టిగా వాటేసుకుని రొనాల్డో తన పుత్రోత్సాహాన్ని కూడా ఆ వీడియోలో చూపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement