భారత్‌లో కబడ్డీ వరల్డ్‌కప్ | Kabaddi World Cup in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో కబడ్డీ వరల్డ్‌కప్

Published Mon, Aug 1 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

Kabaddi World Cup in India

న్యూఢిల్లీ: కబడ్డీ అభిమానులను త్వరలోనే మరో ఈవెంట్ అలరించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కబడ్డీ ప్రపంచకప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం 12 దేశాలు పాల్గొననున్న ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం.

అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇరాన్, పోలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొరియా, జపాన్, కెన్యా దేశాల జట్లు ఈ ప్రపంచకప్‌లో తలపడనున్నాయి. ‘2016 కబడ్డీ ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఈ టోర్నీ ద్వారా విశ్వవ్యాప్తంగా కబడ్డీకి ఆదరణను కల్పిస్తాం’ అని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గె హ్లాట్ అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement