
శ్రీకాంత్‌ను అవార్డుతో సత్కరిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులు
గుంటూరు వెస్ట్: బంగారు భవిష్యత్ ఇచ్చిన గుంటూరుకు రుణపడి ఉంటానని అంతర్జాతీయ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఎన్‌టీఆర్ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్–2019 ప్రదానం చేశారు. ఈ సందరర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తన క్రీడా ప్రస్థానం ఇక్కడే ప్రారంభమైందన్నారు. జిల్లాకు తప్పకుండా ఏదొకటి చేస్తానని ప్రకటించారు. జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు దేశానికి పేరు తెచ్చారన్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు స్పాన్సర్స్ సహకారమందించాలని సూచించారు. రోటరీ క్లబ్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అనంతరం శ్రీకాంత్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు వెంకట శేషకృష్ణ, రాధా ముకుందలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మీడియా ఇన్‌చార్జ్ కోయ సుబ్బారావు, రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షుడు జీ సుధాకర్, కార్యదర్శి షేక్ కాలేషావలి, కోశాధికారి పీ శివప్రసాద్, సాంబశివరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment