excellance awards
-
గుంటూరుకు రుణపడి ఉంటా
గుంటూరు వెస్ట్: బంగారు భవిష్యత్ ఇచ్చిన గుంటూరుకు రుణపడి ఉంటానని అంతర్జాతీయ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్–2019 ప్రదానం చేశారు. ఈ సందరర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తన క్రీడా ప్రస్థానం ఇక్కడే ప్రారంభమైందన్నారు. జిల్లాకు తప్పకుండా ఏదొకటి చేస్తానని ప్రకటించారు. జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు దేశానికి పేరు తెచ్చారన్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు స్పాన్సర్స్ సహకారమందించాలని సూచించారు. రోటరీ క్లబ్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అనంతరం శ్రీకాంత్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు వెంకట శేషకృష్ణ, రాధా ముకుందలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మీడియా ఇన్చార్జ్ కోయ సుబ్బారావు, రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షుడు జీ సుధాకర్, కార్యదర్శి షేక్ కాలేషావలి, కోశాధికారి పీ శివప్రసాద్, సాంబశివరావు పాల్గొన్నారు. -
నేడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
సాయంత్రం 7.30 నుంచి సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలను అందజేసిన వ్యక్తులు, సంస్థలకు అందజేసే ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. ఇండియాటుడే గ్రూపు వైస్‌చైర్మన్ శేఖర్‌గుప్త ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 7.30 నుంచి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ‘సాక్షి’ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ఏడాది ఉత్తమ సేవలందజేసిన ఎన్జీవో, ఉత్తమ రైతు, సామాజిక సేవ, కళా రంగంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన యంగ్ అచీవర్, ఆరోగ్యరంగంలో సేవలందజే సిన ఉత్తమ సంస్థలతో పాటు, పబ్లిక్ ఓటింగ్, ఎస్సెమ్మెస్ ద్వారా ఎంపికైన ఉత్తమ దర్శకులు, ఉత్తమ చిత్రాలు తదితర అంశాలలో కూడా అవార్డులు అందజేయనున్నారు.