
నేడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
సాయంత్రం 7.30 నుంచి సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం
హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలను అందజేసిన వ్యక్తులు, సంస్థలకు అందజేసే ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనుంది. ఇండియాటుడే గ్రూపు వైస్‌చైర్మన్ శేఖర్‌గుప్త ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 7.30 నుంచి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ‘సాక్షి’ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ ఏడాది ఉత్తమ సేవలందజేసిన ఎన్జీవో, ఉత్తమ రైతు, సామాజిక సేవ, కళా రంగంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన యంగ్ అచీవర్, ఆరోగ్యరంగంలో సేవలందజే సిన ఉత్తమ సంస్థలతో పాటు, పబ్లిక్ ఓటింగ్, ఎస్సెమ్మెస్ ద్వారా ఎంపికైన ఉత్తమ దర్శకులు, ఉత్తమ చిత్రాలు తదితర అంశాలలో కూడా అవార్డులు అందజేయనున్నారు.