
కుల్దీప్ యాదవ్
కోల్‌కతా: సొంత గ్రౌండ్ వేదికగా జరుగనున్న ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తామే ఫేవరెట్స్ అంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఈ క‍్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇబ్బందులు తప్పవని కుల్దీప్ పేర్కొన్నాడు. కచ్చితంగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తమకే ఉంటుందన్నాడు. ‘క్వాలిఫయర్-2లో మేమే ఫేవరేట్స్‌గా బరిలోకి దిగుతున్నాం. ముంబైలో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. క్వాలిఫయర్-2లో మాతో ఆడటానికి కోల్‌కతాకు వచ్చింది. ఇది మా హోమ్ గ్రౌండ్.. అందుచేత ఇక్కడ మేము చాలా సులువుగా ఆడతాం. ఇక్కడ సన్‌రైజర్స్ గెలవడం అంత ఈజీ కాదు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గెలవడమే మా లక్ష్యం. సన్‌రైజర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది.. అదే సమయంలో మేము వరుస నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాం అనేది విషయం కాదు. తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించడంపైనే దృష్టి పెట్టాం. ఇది నాకౌట్ స్టేజ్. ఎవరు ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. అందువల్ల మాకు ఉన్న అన్ని వనరుల్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్‌పై గెలుస్తామనే ధీమా ఉంది. సన్‌రైజర్స్ జట్టు కూడా బలంగానే ఉంది. దాంతో ఆసక్తికర పోరు జరగవచ్చు’ అని కుల్దీప్ యాదవ్ తెలిపాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment