
కోహ్లిపై ట్యాంపరింగ్ ఆరోపణలు!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటన్ పత్రిక డెరుులీ మెరుుల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కోహ్లి తన నోట్లో చేరుు పెట్టి తీసిన చాక్లెట్‌లాంటి పదార్థం ద్వారా బంతికి మరింత మెరుపు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడని, మ్యాచ్ వీడియోలో అది స్పష్టంగా ఉందని ఆరోపించింది.
అరుుతే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోనే ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై అంపైర్లు, మ్యాచ్ రిఫరీ గానీ, ఇంగ్లండ్ ఆటగాళ్లు గానీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదూ చేయకపోవడంతో ఇది పట్టించుకోవాల్సిన అంశం కాదని ఐసీసీ ప్రతినిధి ఒకరు వెల్ల డించారు. రాజ్‌కోట్ టెస్టు ఈ నెల 13న ముగిసింది.